షర్మిల సభ సూపర్ సక్సెస్
కాకినాడ:జిల్లాలో అందరూ నోటా డాక్టర్ పాండురంగారావు పేరు వినిపిస్తుంది. పిసిసి చీఫ్ వైయస్ షర్మిల సభను డాక్టర్ పాండురంగారావు సక్సెస్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అదిరిందయ్యా పాండురంగా అంటూ డాక్టర్ పాండురంగారావు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చతికల పడినా నేనున్నానంటూ హస్తం పార్టీకి జిల్లాలో పెద్దదిక్కుగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అధికార వైభోగాలు పొందిన అగ్రనేతలు రాజకీయ ఉనికోసం తలో పార్టీని ఎంచుకుని వలస బాట అయినా నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టు బడినడాక్టర్ పాండురంగారావు డాక్టర్ పాండురంగారావు మాత్రం మడమ తిప్పకుండాకాంగ్రెస్ పార్టీ వెన్నంటే నిలిచారు. వైద్య వృత్తిలో ఏమాత్రం తీరిక లేకపోయినా నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో డాక్టర్ పాండురంగరావు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్క అయ్యారు. అప్పట్లో తుని నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్న డాక్టర్ పాండురంగరావుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు.ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను వైయస్ షర్మిల చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొంతఊపు వచ్చింది. ఇది అదునుగా డిసిసి అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓట్లను కాపాడుకునేందుకు సీనియర్ కాంగ్రెస్ వాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ లకు సమ ఉజ్జీ గా హస్తం పార్టీని నిలిపేందుకు డాక్టర్ పాండురంగారావు ముందడుగు వేశారు.పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల తుని సభను జనప్రభంనంతో విజయవంతం చేసి అదిరిందయ్యా పాండురంగా అనిపించుకున్నారు