Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఅట్టహాసంగా అభివృద్ధి  పనులు ప్రారంభోత్సవం

అట్టహాసంగా అభివృద్ధి  పనులు ప్రారంభోత్సవం

ముఖ్య అతిథిగా తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరు..*

తిరుచానూరు :బుధవారం తిరుపతి రూరల్ మండలంలోని బ్రాహ్మణ పట్టు, పాడిపేట, ముళ్ళపూడి పంచాయతీలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన పంచాయతీ ప్రజలు, పార్టీ నాయకులు
పూలమాలలు, శాలువాలతో సత్కారాలు, హారతులు పట్టి ఆత్మీయతను కనబరిచారు..
జనసందోహం నడుమ ప్రారంభోత్సవాల పండుగ జరిగింది..ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి ఇళ్లు అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంకల్పించింది.. అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడి ఇప్పటి వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం ఎనలేని కృషి చేశారు.. ఇప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ కోసం.. మీ బిడ్డగా.. మీ మోహిత్ రెడ్డి నిరంతరంగా పరితపిస్తాడు..: చెవిరెడ్డి మోహిత్ రెడ్డిసంక్షేమం, అభివృద్ధి, కుటుంబ సభ్యులుగా భావించి చేపట్టే పాలన కొనసాగేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి..
బ్రాహ్మణ పట్టు పంచాయతీలో రూ.6 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15 లక్షలు బీటీ రోడ్డు, రూ. 22 లక్షలు, రూ.35 లక్షలు సీసీ రోడ్డుతో పాటు రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన మెటల్ రోడ్డులను ప్రారంభించారు..పాడిపేట పంచాయతీలో రూ.6.58 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో రూ.21.50 లక్షలతో నిర్మించిన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
అలాగే హరిజనవాడలో రూ.8 లక్షలతో నిర్మించిన ఖర్మ క్రియల భవనం, రూ.25 లక్షల గోవిందపురం మెయిన్ బీటీ రోడ్డు, రూ.21 లక్షల శివపురం రోడ్డు, రూ.10 లక్షల విశ్వసాయి అపార్ట్ మెంట్ సీసీ రోడ్డులు, పద్మ నివాసిని టవర్స్ వద్ద రూ.25 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభించారు..
ముళ్ళపూడి పంచాయతీలో.. రూ.4.91 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టారు..
ఇందులో రూ.21 లక్షల సీసీ రోడ్డు, రూ.21.50 లక్షలతో నిర్మించిన సమావేశ మందిరం, రూ.7.90 లక్షల కర్మక్రియల భవనం, రూ.3.50 లక్షలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్, రూ.9 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ డ్రైన్ ను ప్రారంభించారు. రూ.30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
ఈ ప్రారంభోత్సవాలు పండుగలో ఎంపీపీ యశోద, ఆయా పంచాయతీల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ లు, సీనియర్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article