చంద్రగిరి:
నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలం, దామలచెరువు హైస్కూల్ గేటుకు సమీపంలో నివాసముంటున్న జ్యోతి ప్రసాద్,పార్వతి దంపతుల ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.ఈ ఘటన జరిగిన సమయంలో జ్యోతి ప్రసాద్ పార్వతీల్లతో పాటు సమీప బంధువు మహేష్ కూడా అదే ఇంటిలో నిద్రిస్తున్నారు.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటిలోని సభ్యులు కేకలు పెట్టడంతో ఇరుగు పొరుగువారు నీళ్లు పోసి మంటలను అదుపు చేశారు.మంటల్లో గాయపడిన ముగ్గురుని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన విషయాలు తెలియలేదు. సమాచారంఅందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

