Sunday, September 7, 2025

Creating liberating content

టాప్ న్యూస్అక్షరానికెన్ని అగచాట్లో..!

అక్షరానికెన్ని అగచాట్లో..!


*ఏది సత్యం… ఏది అసత్యం
*ఏది నిత్యం… ఏది అనిత్యం..
*ఏది ధర్మం…ఏది అధర్మం…
*ఏది శాస్వితం …ఏది ఆశాస్వితం…
*ఏది లోపం…ఎందుకింత పాపం..
*అక్రిడేషన్ లపై ఇంత అరాచక మేల
*ఎవరి స్వార్థం కోసం ఇంత కుంచితత్వం.
*నాయకత్వమంటే నంగనాచి పనులకా…
*సంఘాలుండెది సన్మానాలు,సిఫార్సుల కోసమా…
*సమస్యకు పరిష్కారం చూపలేని సంఘాలున్నా లేకున్నా.. ?
*అనర్హులకోసం అర్హులను బలి చేస్తారా…
*అక్రరం రాని వాడి అహంకారం కోసం ఆ అక్షరాన్నే బలి చేస్తారా…
*కూటమి ప్రభుత్వానికి కొంగొత్త సమస్యలు తెచ్చిందెవరు…
*భావి ముఖ్యమంత్రి కి ఇంత భంగపాటేల…
*పాత్రికేయులకు లేని వక్రభాష్యం నేర్పేదేవరు…
*నాయకులరా మీకు నమస్కారములురా అయ్యా…
*మీ నాయకత్వం కోసం ఇంకెన్ని నయవంచనలు చేస్తారు…
*ఏమిటీ అక్రిడేషన్ ల గోల… ఎందుకింత గందరగోళం..?
(రామమోహన్ రెడ్డి)
“తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జరులకెల్ల నుండుదప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ..!”అని వేమన శతకం లో చెప్పబడిన విదంగా అక్షరమనే ఆయుధం తో ఎన్నో మారెన్నో తప్పులను వెలికి తీసి వాటిని ఒప్పులుగా మార్చి ప్రజలకు మంచి జరుగుటకు ఉద్యమించే అక్షరానికి నేడు ఎన్ని అగచాట్లు వచ్చాయని అనుకుంటేనే ఆవేదనతో రగిలిపోతున్నారు అక్షర సమిధలు. అందరి తప్పులను ఎత్తి చూపే వారే అనేక తప్పుల మీద తప్పు చేస్తూ ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయక నిస్సందేహంగా,నిర్మొహమాటంగా,నీతి తక్కువని తెలిసి కూడా నిస్సిగ్గుగా నీచమైన పనులకు ఒడిగడుతుంటే ఓనమాలు రాని వాడు కూడా ఓహో వీరి బ్రతుకులు ఇవే కదా అని ఓ వైపు నుంచి చిందేస్తున్నారు.
అసలు వేలాదిమంది పాత్రికేయుల మనోభావాలతోముడి పడి ఉన్న అక్రిడేసన్ లు అనే అంశంలో ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టే విధంగా ఎందుకు ఈ సంఘాలు పదే పదే పైకి లేఖలు ఒక విదంగా లోన మరో విధంగా ప్రవర్తిస్తూ సమాచార శాఖ పై పాత్రికేయ లోకానికి ఒక విధమైన అపవాదును అంట గట్టే ప్రయత్నం చేస్తున్నాయో అర్థం కానీ పరిస్థితి దాపురించడం ఈ రాష్ట్రంలో ఉన్న పాత్రికేయులు చేసుకున్న పాపమా లేక సంఘాల నాయకులు చెల్లుబాటు తనమా అన్నది అర్థం కావడం లేదు.కేవలం ఒక ప్రెస్ క్లబ్ అంశము ముడిపడి సంఘాల మధ్య ఉన్న వైషమ్యాలను యావత్ పత్రికా ప్రపంచాన్ని నాశనం చేసేలా ప్రవర్తించడం అన్నది సరైన విధానం కాదన్నది మెజార్టీ సభ్యుల అభిప్రాయం.
“చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరువైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ”అని సుమతి శతకం లో చెప్పబడిన విదంగా దశాబ్ధాల క్రితం నిర్మించిన ప్రెస్ క్లబ్ వ్యవహారం ఉండడటం అనేది అత్యంత సిగ్గుచేటని చెప్పాలి.నాయకులు అంటే ఏమిటీ నాయకత్వం అంటే ఏమిటో నేటి సంఘాల వారినిచూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించడం ఈ రాష్ట్ర పాత్రికేయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్య మని చెప్పక తప్పడం లేదు.ఒకనాడు నాయకుడు అంటే తాను నష్టపోయిన నమ్మి ఉన్న నాయకత్వం కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చే విదంగా ఉండడం చూసిన రోజులు నుంచి ఎందరు చచ్చిన ఫోటోల కు ఫోజులిచ్చి తమ నాయకత్వాన్ని బలంగా ఉందని గొప్పలు చెప్పుకునే దయనీయ స్థితిలోకి పత్రికా వ్యవస్థ నానాటికి చేరడం చూస్తే సిగ్గుతో తలదించుకొంటోంది అక్షరం.
ఏది సత్యం ఏది అసత్య…ఏది నిత్యం…ఏది అనిత్యం …ఏది ధర్మం …ఏది అధర్మం.. ఏది శాస్వితం.. ఏది ఆశాస్వితం.. ఏది లోపం.. ఏవరిది లోపం.. ఎందుకింత పాపం చేస్తున్నామనే విచక్షణ లేని పాత్రికేయ లోకం లో ఉన్నామని అనుకుంటేనే ఆవేదన చెందుతుంది అక్షరం.మరి ఇలాంటి మేధావులు కమిటీ మెంబర్ల ఉండి కూడా అక్షర జ్ఞానం లేని వారికి ,ఆయోగ్యుల కు అక్రెడిషన్ ల మంజూరుకు గత ప్రభుత్వ హయాంలో ఎందుకు ఆమోద ముద్ర వేసారో నిగ్గదీసి అడిగితే అందుకు సమాధానం చెప్పే ఇది లేక కుంటి సాకులు వెతికి పలాన వాడు అది ఆ పలాన వ్య్వక్తి ఆ పార్టీ ,ఆ పత్రిక అది ఇది అని సొల్లు కూతలు,కారు కూతలు కూయిస్తూ తమ ఉనికికి ప్రమాదం వస్తుందని తెలిస్తే ఎంతకయిన బరితెగింపు విధానం అనుసరించే వారి తో కలిసి బ్రతకడం అనేది నేటి ఈ పరిస్థితి దాపురించింది.సమర్థవంతంగా పాలన అందించడం లో అవిశ్రాంత పటిమ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా యువనాయకత్వం తో అందరిని మెప్పు తో భావి ముఖ్యమంత్రి గా పరిణతి చెందబోతున్న నారాలోకేష్, సమాజ మార్పు కోసం పాటుపడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం లో కూడా పత్రికా వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొవాల్సి వస్తోందంటే కేవలం పాత్రికేయుల జీవితాలతో చెలగాటం ఆడుతూ సంఘాల ముసుగులో తమ సంచులు నింపుకోవడానికి చూస్తున్న ఈ సంఘ నాయకుల దురంకారా చేష్టలకు నిదర్శనమనే చెప్పాలి.నలుగురు బాగు కొరలేని నలుగురు శ్రేయస్సు కోసం పనిచేయడం చేతకాక దుశ్శాలవాల ముసుగులో దుర్మార్గపు పనులు చేసే వారి దుర్మార్గం బట్టబైలు అయ్యినప్పుడే ఈ పత్రికా సమాజం బాగుపడుతుందని ఆశించక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article