సిఐ చాంద్ బాషా
వేంపల్లె
మండల పరిధిలోని ముతుకూరు గ్రామంలో అక్రమ మద్యం పట్టుబడినట్లు వేంపల్లె సీఐ చాంద్ బాషా వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందితో కలిసి అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆ గ్రామానికి చెందిన మాచనూరు వెంకటరమణ(60) వద్ద సుమారు 102 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ విధించినట్లు వివరించారు. మండలంలో ఎవరైనా ఎలాంటి అసాంఘిక, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైన ఉపేక్షించేదే లేదని సిఐ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వీరన్న, మహమ్మద్ అలి, మహేష్ పాల్గొన్నారు.