ఎంపీపీ ని అభినందించిన ఎంపీడీవో
లేపాక్షి: మండల పరిషత్ అధ్యక్షురాలు, జెడ్పిటిసి, ఎంపీటీసీలు ,సర్పంచులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు తనకు సహకరిస్తే మండల అభివృద్ధి సాధ్యమని ఎంపీడీవో వాసుదేవ గుప్త పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెంకటరత్నమ్మను ఎంపీడీవో వాసుదేవ గుప్త మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. మండలంలో ఎండాకాలం రావడంతో సాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం, మండల అభివృద్ధి పనులు పగడ్బందీగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, లేపాక్షి సర్పంచ్ ఆదినారాయణ, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, కోఆప్షన్ సభ్యులు బషీర్లతో పాటు ఎంపీటీసీలు ఉన్నారు.