గాజువాక:గాజువాక ధర్మాలను కలిసి తన విజయానికి సహకరించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ ను అధికారం గా ప్రకటించడంతో అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం లో ఉన్న వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలను వారివారి నివాసాలకు వెళ్లి తన గెలుపుకు సహకరించాలని కోరుతున్నారు. అందులో భాగంగా సోమవారం జీవీఎంసీ 64 వ వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గతంలో నాగిరెడ్డి గెలుపు కోసం ఏ విధంగా అయితే పని చేశారో అదే విధంగా తనకు కూడా సహకరించాలని కోరేరు. ఎమ్మెల్యే నాగిరెడ్డి మీకు ఎటువంటి స్థానం కల్పించారో అదేవిధంగా తనను గెలిపిస్తే అంతే విధంగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటానని ఏ ఒక్కరికి అన్యాయం చేయనని ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తానని మరొకసారి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి సూచనలు సలహాలు తీసుకుని ఆయన అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని ధర్మాలకు తెలిపారు. ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సూచనలతో వైయస్సార్ సిపి పార్టీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యున్నతికే మేము పాటుపడతామన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని పార్టీ అభ్యున్నతి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా చేస్తామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం లో ఉన్న అన్ని వార్డుల కన్నా ఈ 64 వార్డులో అత్యధిక మెజారిటీతో వచ్చే విధంగా తనతో పాటు ప్రతి ఒక వైసీపీ కార్యకర్త పని చేస్తారని గుడివాడకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు తిప్పల గోపి, తిప్పల అప్పల స్వామి, డిఎల్‌బి నూకరాజు, కోవిరి బాపనయ్య, పెర్ల దేవా, పితాని అన్నవరం, సరిపిల్లి అప్పారావు, నక్కా రమణ, ధర్మాల హరీష్, పితాని సుమన్, కదిరి బూలోక, సమ్మిడి ప్రవీణ్ కుమార్, ధర్మాల అచ్యుత్ రెడ్డి,