Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఅంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

మార్కాపురం:అంతర్జాతీయ మాదకద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం జూన్ 26 సందర్బంగా అవగాహన.సదస్సు ,ర్యాలీలు,మానవ హారాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకం గా ప్రతిజ్ఞ నిర్వహణ
చేయడం జరిగింది. జూన్ -26 అంతర్జాతీయ మాదకద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మార్కాపురం ఆధ్వర్యంలో మార్కాపురం లోని గౌతమి హై స్కూలు మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, చట్ట పరమైన చర్యలు, శిక్షలు, డ్రగ్స్ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి, డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులు పాత్ర తదితర అంశాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ ఈ బి) అసిస్టెంట్ సూపరింటెండెంట్ ( ఏ.ఈ.ఎస్)డి.ఎస్.దుర్గా.ప్రసాద్ .మాట్లాడుతూ కొందరు గమ్మత్తును ఆస్వాదించేందుకు, మరికొందరు మానసిక ఒత్తిడి, సమస్యలు వలన, విద్యార్థులు, యువత కొత్త పరిచయాలు ద్వారా చెడు వ్యసనాలతో డ్రగ్స్ సేవించడం మొదలు పెడతారని, తుదకు వాటికి బానిసలై దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇతర నేరాలకు పాల్పడుతున్నారని, డ్రగ్స్ వాడకం వలన ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. డ్రగ్స్‌ వాడకం వలన శరీరంలో నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, క్రమేపి ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు ఏర్పడి రోగనిరోధక వ్యవస్థ, జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని,శరీరం.శుష్కించిపోతుందని, లివర్‌, ఊపిరితిత్తుల పనితీరు మందగించి, రక్తనాళాలు కుంచించుకుని గుండె అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందని, మెదడు, నరాలు దెబ్బతిని పక్షవాతం వస్తుందని, చివరకు బ్రతికున్న.జీవచ్ఛవంలా.మారిపోతారని తెలిపారు. గంజాయి, హెరాయిన్‌, కొకైన్‌ లాంటి డ్రగ్స్ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా, వాటిని కలిగి ఉన్నా ఎం.డి.పిఎస్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు.నమోదు.చేయబడతాయని, ఒకసారి డ్రగ్ కేసుల్లో పట్టుబడి పోలీసు.రికార్డ్స్.లో.పేరు.నమోదయ్యి భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, పాస్ పోర్ట్, వీసాల వంటివి రావని, సమాజంలో గౌరవం కోల్పోతారని అన్నారు. డ్రగ్స్ వలన వాటిని అమ్మిన వ్యాపారులకు మాత్రమే లాభమని, సేవించిన వారికి తీవ్ర నష్టమని, కావున విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలు మీ దరి చేరకుండా స్మార్ట్ గా వ్యవరించాలని, ఎట్టిపరిస్థితుల్లో డ్రగ్స్ వాడటం అలవాటు.చేయరాదని.సూచించారు. యువత ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోని బంగారు.జీవితాన్ని.నిర్మించుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్ అడిక్షన్ నుండి బయట పడాలంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, డి-అడిక్షన్ సెంటర్లో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయటం వంటివి చేస్తామని తెలిపారు.
మాదకద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి మరియు మాదకద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం పోలీసులకు అందిస్తే వారికి తగిన నగదు బహుమతి ఇవ్వబడుతుందని, , సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఏ ఈ ఎస్ తెలియజేశారు.
సదరు కాలేజీ నుండి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.తదుపరి విద్యార్థుల తో మానవ హారం ఏర్పాటు చేయించి మత్తు పదార్థాలకు వ్యతిరేకం గా ప్రతిజ్ఞ చేయించ డం జరిగింది
ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు మరియు మార్కాపురం ఎస్ ఈ బి. ఏ ఈ ఎస్ డి.ఎస్ దుర్గాప్రాసాద్ , ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఎస్సై ఎం.వి గోపాలకృష్ణ , గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article