- జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ
కేకేఎన్. అన్బురాజన్
అనంతపురము
జిల్లాలో అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసులు తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ నెల వారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహిళలపై నేరాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఈ నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఎన్నికలలో జరిగిన నేరాలను సమీక్షించి ఆయా ప్రాంతాల్లో ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని అందరు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు ప్రణాళికలు, చర్యలు అవసరమని దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చట్టపరమై చర్యలుండాలని, నేర చరిత కల్గిన వారు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, సత్ప్రవర్తనతో జీవించాలని లేదంటే చట్ఠపరమైన చర్యలు తప్పవని సూచించాలన్నారు. “వీటితో పాటు రోడ్డు ప్రమాదాల కట్టడికి కృషి చేయాలి. డీటేల్ యాక్సిడెంట్ రిపోర్టును త్వరితగతిన పంపాలి. మిస్సింగు కేసులు, గుర్తు తెలియని మృత దేహాల కేసులకు శీఘ్రంగా పరిష్కారం చూపాలి. నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్.బి.డబ్ల్యూ.)లు పక్కాగా అమలు చేయాలి. గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన ముగించి కోర్టుల్లో నంబర్లు తీసుకోవాలి. ఈ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలి. కేసులు వీగిపోకూడదు” అని ఎస్పి సూచించారు. బాధితులకు న్యాయం జరగాలంటే … నేరం జరిగాక ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాలు సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయిల్స్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశానిర్ధేశం చేశారు. చీటింగ్ కేసులు, దొంగతనాల కేసుల ఛేదింపునకు కృషి చేయాలి… విజిబుల్ పోలీసింగ్ పెంచాలి. బీట్స్ రీ ఆర్గనైజ్ చేయాలన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా వేయండి. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించండి. జిల్లా ప్రశాంతత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం హోదాలు మరచి అందరం కలిసి సమష్టిగా పని చేద్దామాని, విధులు సమర్థవంతంగా నిర్వర్తిద్దామని అన్నారు.
ఇంకా పలు అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. నార్పల మండల పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన అనంతపురం రూరల్ సబ్ డివిజన్, శింగనమల సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్.విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, సీఎం గంగయ్య, శివభాస్కర్ రెడ్డి, జి.ప్రసాదరెడ్డి, బి.వి శివారెడ్డి, మునిరాజా ( ఏ.ఆర్ ), ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్, జిల్లాలోని సి.ఐ లు, ఆర్ ఐలు, తదితరులు, పాల్గొన్నారు.