హిందూపురం టౌస్
హిందూపురం రూరల్ మండల పరిధిలోని అప్పలకుంట అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం వాసవ్య మహిళా మండలి విప్రో కేర్ సహకారంతో కుశాల్ హెల్త్ కేర్ క్లినిక్ స్పైరులిన చిక్కి పంపిణీ చేశారు . ఈ సందర్భంగా హిందూపురం సిడిపిఓ రెడ్డి రమణమ్మ , , విప్రో ప్లాంట్లు హెచ్‌ఆర్ రామకృష్ణారావు లు మాట్లాడుతూ, గ్రామాలౄ టీబీ, హెచ్ఐవి,, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ సంబంధిత వాటిపై అవగాహన ఇవ్వడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. కుశల్ క్లినిక్ చేస్తున్న సేవలు అలాగే 220 మంది అంగన్వాడీ పిల్లలను దత్తత తీసుకుని చిక్కి ఇవ్వడాన్ని అభినందించి అలాగే చిక్కిని రుచి చూసి ప్రతి రోజు పిల్లలకు ఇవ్వాలని సూచించారు.
కోఆర్డినేటర్ సువర్ణ మాట్లాడుతూ ప్రస్తుతం పంపిణీ చేసిన చిక్కిలో సమృద్ధిగా ఉన్న పోషకాలు, పిల్లల ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుండి వృద్దుల వరకు కుశల్ ఆరోగ్య కేంద్రం నుండి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్లు,కుశాల్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.