Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఅంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన చైర్మన్

అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన చైర్మన్

పులివెందుల టౌన్ :పులివెందుల పట్టణంలోని 2వ వార్డ్ చిన్న కొండారెడ్డి కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ జే సి ఎస్ ఇంచార్జ్ పార్నపల్లికిషోర్, కౌన్సిలర్ గంగా లక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ లోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం పాలు, గుడ్లను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్ర కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభు త్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ,వైకాపా నాయకులు కాలనీ రవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article