పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం మతుకుమల్లిలో అంగన్‌వాడీ కార్యకర్త కేంద్రంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.గ్రామంలోని చింతలబీడు బీసీ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తోన్న జ్యోతి ప్రసన్న(38) సమ్మె తర్వాత విధుల్లో చేరింది.ఆమె బుధవారం ఉదయాన్నే కేంద్రానికి చేరుకుని లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ చేసి..సాయంత్రం 4 గంటల తర్వాత చిన్నారులను, సహాయకురాలిని ఇంటికి వెళ్లాలని, తనకు రికార్డులు రాయాల్సిన పని ఉందని చెప్పి ఆమె అక్కడే ఉంది. రాత్రి 7.30 దాటినా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారులు, బంధువులు కేంద్రం వద్దకు వెళ్లి చూసేసరికి ఉరేసుకుని కనిపించింది జ్యోతి. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.