పులివెందుల టౌన్
పులివెందుల పట్టణం లోని 22 వార్డు అంగన్వాడి కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ భార్గవి జెసిఎస్ ఇంచార్జ్ కౌన్సిలర్ పార్లపల్లి కిషోర్ లు గురువారం తనికి చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి వచ్చే పిల్లలకు, గర్భవతులకు జగనన్న అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడిగి తెలుసుకుని పిల్లల హాజరు పట్టి పుస్తకాన్ని పరిశీలించారు. పిల్లలను, గర్భవతులను జగనన్న అందించే పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా లేదా అనీ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.