రీ పోలింగ్ పిటీషన్ కొట్టివేసిన ధర్మాసనం: పులివర్తి నాని..
చంద్రగిరి :చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా 4 బూత్ లలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల అధికారులు పోలింగ్ నాడు ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదిక సమర్పించంతో చెవిరెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు. ఓటమి భయంతో దాడులు చేయించడం, అధికారులను బెదిరించడం, రి పోలింగ్ కోరడం పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు పూర్తి సహాయసహకారాలు అందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి అధికారులకు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కౌంటింగ్ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని వెల్లడించారు.