గొల్లప్రోలు
హరిత విప్లవ పితామహుడు ఎమ్ ఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడంపై ఆత్మ మాజీ చైర్మన్, స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా హర్షం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజా మాట్లాడుతూ భారతదేశంలో ఆహార ఉత్పత్తులు భారీగా పెరిగేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు కొద్ది నెలల క్రితం స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించినట్లు తెలిపారు. స్వామినాథన్ కు భారతరత్న అవార్డు రావడానికి ఎంపీ గీత కూడా కృషి చేశారన్నారు. స్వామినాథన్ ను రైతులే కాకుండా దేశ ప్రజలందరూ చిరస్థాయిగా గుర్తుంచుకుంటారన్నా రు. స్వామినాథన్ కు భారతరత్న ఇవ్వడంపై రైతాంగం తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వర్ధనపు వీర్రాజు, స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు చోడ పునీడి పుల్లపురాజు, కర్రి కొండలరావు, కొశి రెడ్డి త్రిమూర్తులు, జ్యోతుల శివ, సారిపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.