తిరుపతి రూరల్
తిరుపతి గ్రామీణ మండలం వేమూరు గ్రామానికి చెందిన సుమారు 40 మైనారిటీ
కుటుంబాలకు అవసరమైన స్మశానం ,రోడ్లు ఇతరతా సమస్యల పై తుడా చైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దృష్టి కి స్థానిక ఎంపీటీసీ బి యోగానందరెడ్డి ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. తక్షణమేసమస్యల పై స్పందించిన తుడా చైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్మశాన విషయం పై తిరుపతి గ్రామీణ మండల తహసీల్దారు తో మాట్లాడి తక్షణమే సమస్యని పరిష్కరిస్తామని సూచించారు తహసీల్దార్ కి స్మశానం రోడ్లు సమస్యలపై వేమూరు మైనార్టీ నాయకులు స్థానిక ఎంపిటిసి యోగానంద రెడ్డి తో కలిసి వినతిపత్రం అందజేశారు.

