ట్రిపుల్ఐటి డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి గుప్తా
వేంపల్లె
నిత్యం సూర్య నమస్కారాలు, యోగా, వ్యాయామం సాధన వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ట్రిపుల్ఐటి డైరెక్టర్ డాక్టర్ కుమార స్వామి గుప్తా స్పష్టం చేశారు. ఇడుపులపాయ త్రిబుల్ఐటి ప్రాంగణం లో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ కుమార స్వామి గుప్తా మాట్లాడుతూ ఆరోగ్య నియమాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అలాగే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని అందరూ పరిగణన లోకి తీసుకొని అందరూ వ్యాయామం చేయాలని సూచించారు. వైద్యశాస్త్రంలో వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలన్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకు యోగా ఉపకరిస్తుందన్నారు. మనసు లగ్నం చేసుకోవడానికి యోగా, సూర్య నమస్కారాలు దోహదం చేస్తాయని డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి గుప్తా వివరించారు. రథసప్తమి సందర్భంగా యోగా విభాగం తరుపున విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి గుప్తా, ఓఎస్డి గంగిరెడ్డి, ఏఓ రామ్ భూపాల్ రెడ్డి, డీన్ సి హెచ్ రత్న కుమారి, ఎఫ్ఓ డి జే విపి కోటేశ్వరి, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ బి ఇమ్రాన్ షరీఫ్, స్పోర్ట్ డైరక్టర్ డాక్టర్ షంషాద్ బేగం, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ సుజాత, కూచిపూడి శిక్షకులు మొహిద్దిన్ ఖాన్, యోగా శిక్షకులు ఎస్ అశోక్, వి లక్ష్మి భారతి, తదితరులు పాల్గొన్నారు.