సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఆరు నెలలు పొడిగిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సమాచారం పంపింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి 2024 డిసెంబరు 31 వరకూ ఆయన సర్వీసును పొడిగిస్తున్నట్లుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సీఎస్ నీరబ్ కుమార్ సర్వీసును పొడిగిస్తున్నట్లుగా డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. వాస్తవానికి ఆయన జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. సర్వీసు పొడిగింపు ఉత్తర్వులతో మరో ఆరు నెలల పాటు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.