వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ తుంగల రాముల వారి వీధిలోని 4 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు చేకూర్చిన లబ్ధిని వివరించే సంక్షేమ బోర్డును సచివాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన ద్వారా పేదరికాన్ని పారద్రోలుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం హయాంలో అవినీతి, మోసాలు మాత్రమే ఉండేవని.. ఈ ప్రభుత్వంలో సంక్షేమం, సాధికారత దిశగా పరిపాలన సాగుతోందన్నారు. సీఎం జగన్ ఆలోచనలను, నవరత్నాల పథకాలను తట్టుకుని నిలబడే శక్తి రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు కొండా మహేశ్వరరెడ్డి, ఉద్ధంటి సురేష్, బండి వేణు, పిల్లి కృష్ణవేణి, తుంగం ఝాన్సీ, కొంగితల శివ, ఎర్రిబోయిన శ్రీనివాసరావు, మానికొండ సాంబశివరావు, సన్యాసి రాజు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.