తిరుపతి
సమాచార శాఖలో విజయసింహా రెడ్డి సేవలు మరువలేనివని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు.
తిరుపతి డి పి ఆర్ ఓ గా పనిచేస్తున్న విజయసింహారెడ్డి… బుధవారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి డిఐపిఆర్ఓ బాలకొండయ్య మాట్లాడుతూ… నేటితో పదవీ విరమణ చేసిన డిపిఆర్ఓ విజయసింహారెడ్డిని స్ఫూర్తిని తీసుకొని సమాచార శాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని పేర్కొన్నారు. సుమారు 33 సంవత్సరాలు సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన విజయసింహరెడ్డి సమర్థవంతంగా తన విధులను నిర్వర్తించి ఉన్నతాధికారుల మన్ననలను పొందడం జరిగిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లాంటి జిల్లా కేంద్రంలో ప్రతిరోజు వివిఐపి, వీఐపీల పర్యటనలు, జిల్లా కలెక్టర్ వారి రోజువారి కార్యక్రమాలను అటు మీడియాతో సమన్వయం చేసుకొని విస్తృత ప్రచారం నిర్వహించే వారన్నారు. ఏ బాధ్యతలు అప్పగించినను వాటిని సమర్థవంతంగా నిర్వర్తించే వారని కొనియాడారు.
సమాచార శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్లు చంగల్ రెడ్డి, జయలక్ష్మి లు మాట్లాడుతూ… 33 ఏళ్ల సర్వీస్ కాలంలో విజయసింహారెడ్డి ప్రతి అధికారి మన్ననల్ని పొందడంతో పాటు సిబ్బంది అందరితో ఎంతో సమన్వయంగా కలిసిపోయి పనిచేసేవారని, ఉన్నత అధికారుల ఆదేశాలను ఎన్నడూ గౌరవించే వారని, ఏ పని అప్పగించినా వాటిని సమర్థంగా నిర్వహించేవారు అని పేర్కొన్నారు.
డిపిఆర్ఓలు పురుషోత్తం, వెంకటరమణ మాట్లాడుతూ… నేటితో పదవీ విరమణ చేస్తున్న విజయసింహ రెడ్డితో తమకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని శాఖా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విజయసింహారెడ్డి యొక్క వ్యక్తిత్వం, స్నేహభావం తో మెలిగే వారమని, సమాచార శాఖలో ఎన్నో రాష్ట్రస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో విజయసింహా రెడ్డి పాత్ర ఉండేదని, కీలకమైన విధులను బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించే వారని కొనియాడారు.
కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార శాఖ పిఆర్వోలు, డివిజనల్ పిఆర్వోలు విజయ సింహ రెడ్డి సేవలను కొనియాడారు.
చివరగా కార్యక్రమంలో పదవి విరమణ చేసిన విజయ సింహ రెడ్డి మాట్లాడుతూ… అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో తాను సమాచార శాఖలో 33 ఏళ్లుగా సంతృప్తికరంగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం సమాచార శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు విజయ సింహ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్ఓ మస్తాన్, ఈశ్వరమ్మ, సుబ్బరామయ్య, రిటైర్డ్ ఏవీఎస్ లు సుబ్రహ్మణ్యం కుమార్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార శాఖ అధికారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

