Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుశ్రీ వరసిద్ధి వినాయక స్వామి సేవలోశ్రీ ప్రతాప్ స్వామీజీ

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సేవలోశ్రీ ప్రతాప్ స్వామీజీ

కాణిపాకం :చిత్తూరు జిల్లా కాణిపాకం లో వెలసి ఉన్న శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని శుక్రవారం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రతాప్ స్వామీజీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సర్వలోకాలకు మొదటి పూజ్యుడు, ఎలాంటి విఘ్నాలు తొలగిపోవాలన్నా స్వయంభుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనం శుభదాయకమని, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article