వేంపల్లె :స్థానిక పట్టణంలోని శ్రీ చైతన్య హైస్కూల్ ఆరవణం లో శ్రీ గణేశ సాయి ఆలయ 12వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ బి. చక్రపాణి రెడ్డి కుటుంభ సభ్యులతో కలిసి దేవాలయం లో సామూహిక సత్య సాయి వ్రతం జరిపించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుండి భక్తులు మరియు పాఠశాల ఉపాధ్యాయునీలు వ్రతం లో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు కరస్పాండెంట్ మధ్యహ్నం భోజన సదుపాయం కల్పించారు. అనంతరం శ్రీ గణేశ సాయి ని పాఠశాల ప్రాంగణమంతా భక్తి గీతాలతో చిన్నారుల నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు నిర్వహించి వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.