Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్..!

శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్..!

చంద్రగిరి:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.
ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఫిబ్రవరి 29న ధ్వజారోహణం, మార్చి 4న గరుడ వాహనం, మార్చి 5న స్వర్ణరథం, మార్చి 7న రథోత్సవం, మార్చి 8న చక్రస్నానం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏఓ బాలాజీ, సీఏఓ శేషశైలేంద్ర, చీఫ్ పీఆర్వో డా.టి.రవి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, రవాణా జిఎం శేషారెడ్డి, డెప్యూటీ ఈవోశివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article