Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలువైసీపీ పాలనలో అభివృద్ధి జాడేదీ!

వైసీపీ పాలనలో అభివృద్ధి జాడేదీ!

గెడ్లబీడు‌ పర్యటనలో యనమల దివ్య సూటి ప్రశ్న

తుని:యనమల దివ్యను అసెంబ్లీ గడపెక్కించేంత వరకు తగ్గేదేలే అంటున్నారూ తుని మండలం ఎస్.అన్నవరం‌ పంచాయితీ శివారు జగన్నాధగిరి రామకృష్ణా కాలనీ,గెడ్ల బీడు వాసులు.తండ్రికి తగ్గ తనయురాలుగా ప్రజాదీవెనలు అందుకుంటున్న జననేత్రి యనమల దివ్య,మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు.తన తండ్రి హయాంలో జరిగిన గ్రామీణాభివృద్ధి ని గుర్తుకు తెస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు‌ చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ యనమల దివ్య ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఎస్ అన్నవరం‌ పంచాయతీ శివారు గ్రామాల్లో రెండో రోజు కూడా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం లో అదే జోరు అదే హోరు కనిపించింది.సోమవారం గట్ల బీడు, జగన్నాధగిరి రామకృష్ణ కాలనీలలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులతో కలిసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడుతో‌ కలిసి విచ్చేసిన యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అనంతరం బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన దివ్యకు మహిళలు మంగళహారతలతో స్వాగతం పలికారు.టిడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాల బూచి‌చూపించి జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు.వైసీపీ పాలనలో అభివృద్ధి జాడే లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు‌ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ యనమల శివరామకృష్ణ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, మండల టిడిపి అధ్యక్షుడు అప్పన రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, వంగలపూడి బుజ్జి, వంగలపూడి శ్రీనివాసరావు, జక్కాన రామానాయుడు, పోతల రాంబాబు, గజ్జి రాంబాబు, కుచ్చర్లపాటి అరవింద వర్మ, తమరాన రామకృష్ణ, చింతమనీడి అబ్బాయి, అవగడ్డ వెంకటరమణ, అరిగెల నరసింహమూర్తి‌ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article