500 మందికి పైగా చేరిన కార్యకర్తలు
టిడిపి, జనసేన సిద్ధాంతాలు నచ్చక బయటికి వచ్చిన యువకులు
జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చే పార్టీలోకి
గాజువాక: తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి వైయస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. జనసేన నాయకుడు బలిరెడ్డి నాగేశ్వరరావు నేతృత్వంలో 500 మంది జనసేన కార్యకర్తలు శనివారం వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్సిపి జిల్లా ఐ.టి విభాగ అధ్యక్షుడు బొండా ఉమా మహేష్, కురందాసు శేఖర్, అచ్చిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, గాజువాక బాక్సర్స్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి అమర్నాథ్ సమక్షంలో 500 మందికి పైగా జనసేన టిడిపికి చెందిన కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్సిపి లో చేరారు. స్థానిక మిందిలోని మంత్రి అమర్నాథ్ నివాసానికి వచ్చి ఆయనకి మద్దతు ఇచ్చారు. వీరికి అమర్నాథ్ వైఎస్ఆర్సిపి పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులు, వారి విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నామని చెప్పారు. పార్టీలో కార్యకర్తలకు విలువ విలువ ఇవ్వలేదని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చి, యువకుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో పనిచేయడానికి నిర్ణయించుకుని తామంతా వైసీపీలో చేరుతున్నామని తెలియజేశారు. తామంతా ఈ ఎన్నికల్లో అమర్నాథ్ విజయం కోసం పని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దిలీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, జోసన్, విజయరెడ్డి, మహేష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

