కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించిన కందికుంట
తనకల్లు :మండలపరిధిలోని ఈతోడు గ్రామానికి చెందిన దాదాపు 20 కుటుంబాలు మండల ప్రధాన కార్యదర్శి కుంచే నాగేంద్ర ప్రసాద్, నాయకులు సుంకర మురళి, ఒంటెద్దు కిష్టప్ప ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గం ఎన్డిఎ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో తెదేపా లోకి చేరగా అయన వారికి కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ నాకు మద్దతు తెలిపి, నా గెలుపు కోసం కృషి చేస్తామని, తలుపుల మండలంలో ప్రచారంలో ఉన్నా పార్టీలోకి వచ్చి మీ విజయానికి కృషి చేస్తామని చెప్పడం చాలా సంతోషం. నా గెలుపు కోసం కృషి చేసే వారందరినీ నేను ఎప్పుడు మర్చిపోనని మీకు నేను ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుంచే నాగేంద్ర ప్రసాద్, నాయకులు సుంకర మురళి, ఒంటెద్దు కిష్టప్ప, సోముశేఖర్, జి వేణు గోపాల్, యం యన్ చిన్న రామిరెడ్డి కుళ్లాయరెడ్డి, గుంజువారిపల్లి నల్లప్ప, జయచంద్రారెడ్డి, ఈ.కిష్టప్ప, ఒంటెద్దు రామచంద్ర, దవనం చిన్న, దవనం రామప్ప, దవనం నాగమునెప్ప, దవనం జయరాం, దవనం రామాంజులు, ఒంటెద్దు రామప్ప, చిట్టాలి రామదాసు, ఒంటెద్దు వేమనారి, పలక గంగన్న, ఒంటెద్దు రాము, ఒంటెద్దు నరేష్, ఒంటెద్దు చిన్న నరసింహులు తదితర తెదేపా నేతలు పాల్గొన్నారు..