Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలువైసిపికి రాజీనామా - కాంగ్రెస్ లో చేరిక

వైసిపికి రాజీనామా – కాంగ్రెస్ లో చేరిక

బుట్టాయగూడెం :పోలవరం నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ కు చెందిన కీలక మహిళా నేత దువ్వెల సృజన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై కాంగ్రెస్ నేత దువ్వెల సృజన మాట్లాడుతూ హైదరాబాదులోని ఏపీ సి సి చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి నివాసంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. వైయస్ షర్మిల రెడ్డి కండువా కప్పి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు సృజన తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శాయశక్తులకు కృషి చేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా సృజన కాంగ్రెస్ పార్టీలో చేరిక రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా సృజన రంగంలో ఉంటారనే ఊహాగానాలకు తెర లేపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article