లేపాక్షి :-మండల పరిధిలోని చోళ సముద్రం ఎస్సీ కాలనీకి చెందిన మృతురాలు రాధమ్మ కుటుంబ సభ్యులకు వైకాపా మండల కన్వీనర్ నారాయణస్వామి వైయస్సార్ బీమా పథకం కింద మంజూరైన పదివేల రూపాయలు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ, చోళ సముద్రం ఎస్సీ కాలనీకి చెందిన రాధమ్మ ఇటీవల మరణించారన్నారు. ఆమెకు వైయస్సార్ బీమా వర్తించడంతో మొదటి విడతలో పదివేల రూపాయలను అందజేశామన్నారు. మిగిలిన మొత్తం త్వరలోనే కుటుంబ సభ్యుల ఖాతాకు జమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. అందులో వైయస్సార్ భీమా పథకాన్ని మృతుల కుటుంబాలకు అందజేసి ఆ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారని కన్వీనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోడిపల్లి సర్పంచ్ మంజునాథ్, వెల్ఫేర్ అసిస్టెంట్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

