చంద్రగిరి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని తిరుపతి జిల్లా యువజన విభాగం సంయుక్త కార్యదర్శి రేజర్ల యశ్వంత్ చౌదరి తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలపరుస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయానికి ప్రజలతోపాటు తనమద్దతుదారులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కావటం తద్యమని జోష్యం చెప్పారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతోగెలిపించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందిస్తామన్నారు. తనకు తిరుపతి జిల్లా యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు, నాకు ఈ పదవి రావటానికి కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఉ చెవిరెడ్డిమోహిత్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవిని బాధ్యతగా స్వీకరించి ,నా శక్తి వంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

