ముఖ్యఅతిథిగా ప్రతాప్ స్వామీజీ
రామచంద్రపురం :రామచంద్రపురం మండలం, మిట్టకండ్రిగ పంచాయతీ, పరమాల అరుంధతివాడ లో గంగమ్మ జాతరను గ్రామ ప్రజలు బుధవారం వేడుకగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులతో, యువత టపాకాయలు కలుస్తూ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా తరలివచ్చిన ప్రజలకు ఆశీర్వాదంచేస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో చుట్టూ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు


