Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలువైఎస్ కుటుంబం చీలిపోయింది జగన్ వల్లేదీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యం: వైఎస్ షర్మిల సంచలన...

వైఎస్ కుటుంబం చీలిపోయింది జగన్ వల్లేదీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యం: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

‘‘కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం జగన్ అన్నే. ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నే. దీనికి సాక్ష్యం దేవుడు… దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో నేడు ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ స‌మావేశంలో స్పందించారు.
వైసీపీ కోసం నెలల తరబడి 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టా, స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశానని తెలిపారు.
నా కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా నేను కాంగ్రెస్ లో చేరా… వైసీపీ నేతలు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, విమర్శిస్తారని నాకు తెలుసని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ నిన్న విమర్శలు గుప్పించిన నేపథ్యంలో… షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు.
రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానులో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీకి జగన్ బానిసగా మారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పణంగా పెట్టారని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారు. .. రాజశేఖరరెడ్డి పాలనకు, జగన్ పాలనకు పొంతనే లేదని అన్నారు. నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడు..తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా… ప్రజలకు మేలు చేస్తాడని భరించా… అయినా అలా జరగలేదని మండిపడ్డారు.
జగన్ ఒక నియంత మాదిరి పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరని దుయ్యబట్టారు. ఎంతో మంది కష్టపడి, త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని .. పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు. వైఎస్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్ అనేది వైఎస్సార్ కల.. 1941లోనే దాన్ని నిర్మించాలనుకున్నప్పటికీ ఏ నాయకుడు సాహసం చేయలేదు.. వైఎస్సార్ సీఎం అయిన 6 నెలల్లోనే పోలవరం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు..ఇప్పుడు ఆ ఊసే ఎత్తని జగన్ ఈ ప్రాజెక్ట్ పై ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. 2021లో పోలవరంను పూర్తి చేస్తానని చెప్పిన జగన్… ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగైతే… ఇప్పుడు దండగ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article