- ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా.. సీఎం జగన్ నవరత్న పథకాలు
- యర్రావారిపాలెం-చిన్నగొట్టిగల్లులో నాలుగో విడత వైయస్సార్ ఆసరా..!
- యర్ర వారి పాలెంలోరూ.4.21 కోట్లు..
- చిన్న గొట్టిగల్లు లో రూ.5.54 కోట్లు..
- ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా సీఎం జగన్ నవరత్న పథకాలు: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..
చంద్రగిరి:
వైఎస్సార్ ఆసరా పథకం మహిళా సాధికారతకు
దోహదం చేస్తోందని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ ఆసరా నాలుగో విడత వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులతో యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణాలు పండుగ వాతావరణం నెలకొంది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహిత్ రెడ్డికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు పూలమాలలు, దుస్సాలువలతో సన్మానించి సత్కరించారు. యర్రావారిపాలెంలో 4,572 మందికి నాలుగో విడతగా రూ.4.21కోట్లు మంజూరైనట్లు తెలిపారు. చిన్నగొట్టిగల్లులో రూ.5.54 కోట్లు నిధులు విడుదల చేసినట్లు వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆసరా చెక్కులను మోహిత్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సీఎం జగన్ నవరత్న పథకాలను అమలు చేశారన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన తొమ్మిది పథకాలలో వైయస్ఆర్ ఆసరా పథకం ఒకటని చెప్పుకొచ్చారు. డ్వాక్రా మహిళలైన నా అక్క చెల్లెమ్మల కోసం ప్రారంభించిన బృహత్తర పథకంగా అభివర్ణించారు. ఈ పథకం కింద ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11 వరకు బ్యాంకుల వద్ద పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తూ సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ప్రతి మహిళ కుటుంబ పోషణలో తనదైన శైలిలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నేటి సమాజంలో మహిళలు ఉన్నత శక్తిగా ఎదుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని వెల్లడించారు. పురుషులు ఉద్యోగ బాధ్యతల్లో ఇబ్బందులు ఎదురైనా కుటుంబ పోషణలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారని వివరించారు. అందుకు మహిళలకు ప్రభుత్వ పథకాలు దోహదం చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలు కుటుంబ అవసరాలకు అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకొని ఇబ్బందులు పడిన సందర్భాలను గుర్తు చేశారు. ఇప్పుడు మహిళలు అధిక వడ్డీతో రుణం తీసుకోవలసిన అవసరం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ.ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. పండుగ సందర్బాలలో మహిళలకు కానుకలు అందజేస్తూ మహిళా పక్షపాతిగా నిలుస్తున్నారని కొనియాడారు. మండలంలో సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. మీ అందరి బిడ్డగా, అన్న దమ్ముడుగా అందుబాటులో ఉంటాను.. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదరించి ఆశీర్వదించాలని మోహిత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఇతర పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

