తనకల్లు:తనకల్లు మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహం ప్రక్కన ఉన్న బోరు వృధాగా ఉంది 15 ఏళ్ల క్రితం వసతి గృహం విద్యార్థుల కోసం అప్పటి ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి బోరు వేసి,మోటార్ అమర్చారు. విద్యార్థులు లేరని వసతి గృహం మూసివేయడంతో బోరు, మోటార్ వృధాగా పడి వున్నాయి. బోరుకు ఉన్న స్టాటర్ దొంగలు వెత్తుకువెళ్లారు అప్పటి నుండి బోరు వృధాగా ఉంది. బోరులో నీరు పుస్కలంగా ఉంది, అయినా బోరును ఎవరు పట్టించుకోలేదు వేసవిలో ప్రజల దాహర్తి కోసం ఇబ్బదులు పడకుండ మండల అధికారులు స్పందించి జిల్లా గిరిజన శాఖ ఆధికారులతో సంప్రదించి బోరు వాడుకొనేవిధంగా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.