విశాఖ:-
విశాఖ పశ్చిమ నియోజకవర్గం విశాఖ పశ్చిమ పారిశ్రామిక ప్రాంతం ఎక్స్ జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర రావు ఆధ్వర్యంలో వైసిపి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 92వార్డు పరిధిలో జనతాకాలనీ,SC BC కాలనీ,కంపరపాలెం,పద్మనాభంకాలనీ,వెంకటాపురం,నందమూరి నగర్ లో రోడ్ షో చేసారు ఈమేరకు ప్రజలుతో కొంతసేపు ముచ్చటించారు.రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో92 వ వార్డు అధ్యక్షులు గొర్లే అప్పలస్వామి నాయుడు ,92 వార్డుల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎల్ఎఫ్ సభ్యులు బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, గృహసారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు ,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

