రోడ్ షో లో యనమల పిలుపు
తుని :జగన్ రెడ్డి విధ్వంసకర పాలనతో ఆంధ్ర ప్రదేశ్ అధోగతి పాలయింది శాసన మండలిలో ప్రతి పక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.తుని అసెంబ్లీ,కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తుని మండలం చేపూరు మర్లపాడు రాజుపేట చినవెలంపేట సీతయ్య పేట తదితరు గ్రామాల్లో యనమల రామకృష్ణుడు రోడ్ షో నిర్వహించారు బార్లు తీరిన ప్రజలకు ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.యనమల రోడ్ షో కు విశేష స్పందన లభించింది. ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన టిడిపి బిజెపి జనసేన ప్రభుత్వాన్ని, అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. వైకాపా పనులు అడుగంటిన అభివృద్ధి, తిరిగి ఉమ్మడి ప్రభుత్వం లో శరవేగం పడుతుందన్నారు. అన్ని వర్గాల
అభ్యున్నతే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పన రాము, దూలం మాణిక్యం,కరపా అప్పారావు, స్థానిక నాయకులు పాల్గోన్నారు
హంసవరంలో యనమల దివ్య రోడ్ షో
విద్యా మేధావి దివ్యను గెలిపించండి
మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పిలుపు

అదేవిధంగా తెలుగుదేశం,జనసేన బిజెపి కూటమి అభ్యర్థి యనమల దివ్య ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం పూర్తి కావడంతో ఆమె రోడ్ షోల ద్వారా
ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తొండంగి మండలం హంసవరంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి, తొండంగి మండలం లో నిర్వహించిన దివ్య రోడ్ షో రూమ్ ప్రజలను విశేష స్పందన లభించింది. ప్రజలు అడుగడుగున మేడం దివ్య కు బ్రహ్మరథం పట్టారు
మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు
ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల దివ్య ప్రణాళికాయుతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అవినీతికి తావులేని సుపరి పాలన
అందిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ ,జనసేన నాయకులు చోడిషెట్టి గణేష్, బిజేపి నాయకులు వెలుగుల గోపాల కృష్ణ, రాంబాబు రాజు, దంతులూరి శ్రీనివాస్ రాజు, పృధ్వీ రాజు, దంతులూరి బాబు, చొడ్రాజు చిరంజీవి రాజు, కాలిబోయిన జోగారావు,కలిబోయిన గంగారావు,విజయ్, కిల్లాడి తాతారావు, నరాల దుర్గారావు, కాలిబోయిన దుర్గప్రసాద్, తిప్పరాల యేసు, కర్రి లక్ష్మణ్, నేమాల శ్రీను, అంభుజాలపు శ్రీనివాసన్, కకాటి సురేష్, దూలి కొండలరావు, కుమ్మరి సత్యనారాయణ, మరియు తెలుగుదేశం జనసేన బిజేపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

