కడప సిటీ
కరెంటు కోతలతో పంటలుఎండుతున్నాయనిసోమవారంకడపజిల్లాలోచింతకొమ్మదిన్నెమండలంమూల వంక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరిరెడ్డిమాట్లాడుతూ మండలంలో ఉద్యానవనపంటలు, అరటి, ఆకుతోటలు చీని ,బొప్పాయి,నువ్వు , వేరుశనగ పంటలు బోర్ల కింద సాగు చేశారని, కరెంటు కోతలతో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. 9 గంటలువస్తున్నకరెంటుప్రస్తుతం7:గంటలు వస్తున్నదనిఅదికూడా ఎప్పుడుపడితేఅప్పుడుకరెంటుతీస్తున్నారని ఆయన అన్నారు. కరెంటుకోతలపైమండల విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేస్తేనిర్లక్ష్యంగాసమాధానంచెబుతున్నారని ఆయన అన్నారు. సీకే దిన్నె మండలాన్ని ప్రత్యేకదృష్టిలోఉంచుకొని తొమ్మిదిగంటలు కరెంటునిరంతరయంగా సరఫరాచేయాలని ఆయనకోరారు.కరెంటుకోతలనునివారించకపోతేకాలంలోఆందోళన పోరాటాలకు శ్రీకారం పుడతామని ఆయనహెచ్చరించారుఈనిరసనకార్యక్రమంలోఏపీరైతుసంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య,నాయకులుచిన్నసిదయ్య హరి , సిద్ధయ్య రమణ రెడ్డి, వీరయ్య, ఖలీల్ తదితరులుపాల్గొన్నారు.