సదుపాయాన్ని కల్పించిన పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్
పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల పట్టణంలోని ఓ.ఎల్.ఎప్. ఎలిమెంటరీ, హైస్కూల్, కళాశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ యనమల సుధాకర్ వెంటనే స్పందించి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను కోరగా ఆయన గ్రాంట్ నుండి మినరల్ వాటర్ ప్లాంట్ కు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వెంటనే పనులు చేపట్టి విద్యార్థులకు త్రాగునీటి సమస్య లేకుండా పూర్తి చేసి సోమవారం ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారని వారికి మంచి ఆరోగ్యాన్ని అందించడంలో భాగస్వాములమై వారికి త్రాగునీటి సమస్య ఉండడంతో మినరల్ ప్లాంటును మంజూరు చేపించామని ఆయన అన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ సుపీరియర్ మాణిక్యం, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సిస్టర్ జెల్సి, సర్పంచ్ సుధాకర్ సతీమణి జసింథ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు చిత్త రాణి, హెల్మెట్రీ స్కూల్ హెచ్ఎం డేల్సి ,ఫాదర్ విజయభాస్కర్, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.