బుట్టాయగూడెం. మండలంలోని రెడ్డిగూడెం గ్రామస్తుడు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈనెల 7వ తేదీన రోడ్ ప్రమాదం లో మరణించాడు. మృతుని కుటుంబానికి బుధవారం పోలవరం శాసన సభ్యుడు తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి రూ.5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి వచ్చే బీమా తొందరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మొడియం రామతులసి, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ,మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరేటి శాంతి కుమారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ కుంజా దుర్గమ్మ, సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు బన్నే బుచ్చిరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు,స్థానిక వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.