శాసనసభ్యులు బాలరాజు
జీలుగుమిల్లి :ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన బలే రామకృష్ణకు పోలవరం శాసనసభ్యులు బాలరాజు పదివేల రూపాయలు ఆర్థిక వితరణ చేశారు.
బల్లే రామకృష్ణ కు కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత.. మొదటిసారిగా వారి గ్రామానికి వచ్చినప్పుడు కలిసి ఎమ్మెల్యే కి తనగోడు విన్నవించారు. దానికి స్పందించి ఎమ్మెల్యే పదీవేలు రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వానలు వరదలు తనిఖీలు లలో తనకి డబ్బులు అందలేదని తెలుసుకోనీ నిన్న రాత్రి ఇంటికి పిలిపించి ఆర్థిక సహాయం అందజేశారు. చిర్రి.కృష్ణయ్య మరియు కొడుకు హర్షవర్ధన్ చేతుల మీదుగా బల్లే రామకృష్ణ కు ఆర్థిక సహాయం అందజేశారు.

