మార్కాపురం
పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్ ఎ.ఎస్.పి బి.భవాని హర్ష అక్రమంగా రేషన్ బియ్యం ను సుంకేసుల గ్రామం నుండి త్రిపురాంతకం వైపు తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్దారవీడు మండలం , దేవరాజుగట్టు గ్రామ సమీపంలో AP 16TD 8533 వాహనం లో 54 పిడిఎస్ వివిధ రంగులు గల ప్లాస్టిక్ బ్యాగులను మొత్తం 27 క్వింటాలు రేషన్ బియ్యం ను మరియు వాహనం ను సీజ్ చేసారు.అక్రమంగ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న వారి పై పెద్దారవీడు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసుల నమోదు చేయడం జరిగింది.ఈ తనఖి లలో సివిల్ సప్లైస్ ఈ.డి.ఎ ఎ.తిరుపతిరెడ్డి, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్సీఐరాఘవరావు,ఎస్సై నాగేశ్వరరావు,ఎస్సై కె.వెంగల రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు