వి.ఆర్.పురం: రేకపల్లి గొల్లగూడెం గ్రామంలో మోడెం వెంకన్న బాబు ఆధ్వర్యంలో ఐదు కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరడం జరిగినది, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ వారిని కండువా కప్పి పార్టీలోకి సాధవనంగా ఆహ్వానించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేఖపల్లి గొల్లగూడెం గ్రామాన్ని 1987లో సిపిఎం పార్టీ పోరాట ఫలితంగానే ఈ గ్రామాన్ని నిర్మించడం జరిగినది అని వారు వ్యాఖ్యానించారు. గతంలో పంచాయతీ పాలకులు గొల్లగూడెం గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని, కానీ సిపిఎం పార్టీగా గ్రామపంచాయతీ గెలిచిన తర్వాత ఎంజి,ఎన్,ఆర్,ఇజి,ఎస్ నిధులతో గ్రామంలో సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి , సర్పంచ్ పూనేం సరోజినీ, పార్టీ మండల కార్యదర్శి సోయం చినబాబు, మండల కమిటీ సభ్యులు పంకు సత్తిబాబు, వడ్లాది రమేష్, మండల నాయకులు గుండెపూడి లక్ష్మణరావు, సిరపు తాతబాబు, వేటగాని సూరి, నారపు ప్రకాష్ రావు, వీర్ల నాగేశ్వరరావు , ఆత్మకూరి కాంతారావు, చల్ల హజరత్, గ్రామ పెద్ద పెనబోయిన ముత్తయ్య, సోలా ఏసుబాబు పినబోయిన శ్రీను, నిల పాల బ్రహ్మయ్య, మొగిలి పువ్వు సతీష్, సోలా చమ్మన్న తదితరులు పాల్గొన్నారు.