Thursday, May 1, 2025

Creating liberating content

క్రీడలురెండు టైటిళ్లు అసాధారణం.. మా వాళ్లు మంచి ఆటగాళ్లు: కావ్య మారన్

రెండు టైటిళ్లు అసాధారణం.. మా వాళ్లు మంచి ఆటగాళ్లు: కావ్య మారన్

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన టీ20 లీగ్ రెండో సీజన్ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలవడంపై ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ సంతోషం వ్యక్తం చేసింది. వరుసగా రెండు టైటిళ్లు గెలవడం అసాధారణమని తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించింది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగులతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్ వార్‌లో టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ క్రికెట్ జట్టు. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లలో స్టబ్స్ 56 పరుగులు, అబెల్ 55 పరుగులతో హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. వారికి హెర్మెన్ 42 రన్స్, మార్‌క్రమ్ 42 రన్స్‌తో రాణించి తోడుగా నిలిచారు. ఇక డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్స్ తీయగా.. టాప్లీ ఒక వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ తుది పోరుల హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అబెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అలాగే టోర్నీ మొత్తంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన హెన్రిస్ క్లాసెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కాగా గతేడాది జరిగిన మొట్టమొదటి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దక్కించుకుంది. రెండోసారి కూడా టైటిల్ గెలవడంతో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ తెగ సంబరపడిపోయింది. స్టేడియంలో అరుస్తూ గోల చేసింది.సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్రోఫీని కావ్య మారన్‌కు అందించారు.
‘ఇది మాకు రెండో టైటిళ్లు. వరుసగా రెండు ట్రోఫీలు గెలవడం చాలా సంతోషంగా ఉంది. బ్యాట్, బంతితో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. సమష్టి ప్రదర్శనలతో ఈ సీజన్‌ మొత్తం ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు ఇదే ఆటతీరును కొనసాగించి టైటిల్ అందుకుంది. వరుసగా రెండు టైటిళ్లు అందుకోవడం అసాధారణం. ఈ విజయం పట్ల కుర్రాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారు. బలమైన జట్టుతోనే తలపడ్డాం. చివరకు విజయాన్ని అందుకోని ఛాంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉంది.’అని కావ్య మారన్ చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article