మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి
హిందూపురం టౌన్
హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికి ఇల్లు పథకంలో భాగంగా లబ్దిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలను లబ్దిదారులకు చేస్తు న్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సచివాలయాల కార్యదర్శులను మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం పట్టణంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లను ఆయన పరి శీలన చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ లకు సర్వర్ సమస్య వస్తున్నదని, అయితే ఉదయం త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీంతో పాటు సాయంత్రం సమయం లో సైతం సాధ్యం అయినంత వరకు ఎక్కువ సమయం విధులు నిర్వహించాలన్నారు. ఆ సమయంలో సర్వర్ బాగా పని చేస్తుందని సూచించారు.