భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పుత్తా
కడప సిటీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారము 18 వ డివిజన్ పరిధిలోని జెవి నగర్, విశ్వనాధపురం ఎస్ ఆర్ నగర్ కాలనీలలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన జే వి నగర్ నందు గల స్టార్ మెడికల్ యజమాని టి.తారక రామాంజనేయులు తో మీరు విద్యావంతులు, ఈ ప్రభుత్వం పాలన నాలుగున్నర సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు. కానీ ఏ ఒక్క నిరుద్యోగి గాని ఏ ఒక్క బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి యువకులకు ఓటర్లకు ఈ పార్టీ ఎటువంటి న్యాయం జరగలేదని మీరు గమనించారు కాబట్టి ఈసారి జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పార్టీ పట్టంకట్టి బాబు వస్తే జాబు గ్యారెంటీ అనేటటువంటి నినాదాన్ని మీరు గుర్తు పెట్టుకొని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నిలదీయటానికి మీకు అధికారం ఉందని ఈ కార్యక్రమం సందర్భం గా మీకు హామీ నేనిస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేశారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఓటరు దేవుళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.