Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీ- మరో ఇద్దరు ఐపీఎస్​లు సైతం

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీ- మరో ఇద్దరు ఐపీఎస్​లు సైతం

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు.

19 మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్ ప్రసాద్​ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్​లతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్​ అధికారులను కూడా బదిలీ చేశారు.

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్ ప్రసాద్​ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్​లతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్​ అధికారులను కూడా బదిలీ చేశారు.

రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరాము ను అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఆర్‌.పి. సిసోడియా కు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. జి.జయలక్ష్మి కి సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్‌ దండే ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. సురేశ్‌ కుమార్‌ ను పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి , గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరభ్‌ గౌర్‌ ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. యువరాజ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి గా హర్షవర్ధన్‌ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. పి.భాస్కర్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి, ఈడబ్ల్యూఎస్‌, జీఏడీ సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు అప్పగించింది.

కె.కన్నబాబు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు అప్పగించింది. వినయ్‌చంద్‌ పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వివేక్ యాదవ్‌ యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి గా నియమించింది. సూర్యకుమారి మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సి.శ్రీధర్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. జె.నివాస్‌ ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. విజయరామరాజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. హిమాంశు శుక్లా సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌ గా నియమించింది. ఢిల్లీరావు వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

హరీశ్‌కుమార్‌ గుప్తా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌ డీజీగా బదిలీ చేసింది. కుమార్‌ విశ్వజిత్‌ హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. గిరిజాశంకర్‌ ను ఆర్థికశాఖ నుంచి రిలీవ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article