- జగనన్నకు మరోసారి పట్టం కడతామంటున్న జనం
- గడప గడపలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఘన స్వాగతం
చంద్రగిరి:
“రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటా సంక్షేమ పండుగ నెలకొంది.. కులం, మతం, ప్రాంతం, వర్గం పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ది దారులను ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి కనీసం 5 సంక్షేమ పథకాలకు తక్కువ లేకుండా అందించిన జగనన్నను మరోసారి గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నామంటూ పల్లెజనంస్పష్టంచేస్తున్నారుచంద్రగిరి మండలం ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలో రెండవ రోజైన బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాత గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ లబ్ది పొందిన వారికి సంక్షేమ జాబితాలను అందజేశారు. ఆ తర్వాత ప్రతి లబ్దిదారులతో మాట్లాడి తీసుకున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయం ఆరా తీయగా అత్యధిక శాతం మంది లబ్ధి దారులు ప్రభుత్వ సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు యువత గ్రామ శివార్లలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎదురేగి స్వాగతం పలికారు. స్థానిక మహిళలు తమ ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన హర్షిత్ రెడ్డికి హారతులు పట్టి సాదరంగా ఆహ్వానిస్తూ తమ ఆనందాన్ని, కష్టాలను చెప్పుకున్నారు. ప్రతి ఇంటా కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలు గుర్తు చేసుకున్నారు.ఎ.రంగంపేట పంచాయతీలో రెండవ రోజు కూడా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జనం నుంచి అపూర్వ స్పందన రావడం, సమస్యలు పరిష్కారంపై ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు సూచించారు . అనంతరం కనిపించిన వారందరినీ పలుకరిస్తూ తన అన్నయ్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేయగా తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, పలువురు మండల స్థాయి నేతలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.