Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలురాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు: చంద్రబాబు

రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు: చంద్రబాబు

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ఉన్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు .”మీ భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు. రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు, లేదా మార్చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. మీ ఓటు ఉన్నదీ, లేనిదీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది. కాబట్టి ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article