Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలురాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన

శాండ్, ల్యాండ్, కబ్జాలతో వైకాపా నేతల అక్రమార్జన
వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే
హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ

హిందూపురం టౌన్
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హిందూపురం పర్యటన కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుకాసురులు, భూ బకాసురులు, కబ్జాదారులు పెరిగిపోయారని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైకాపా నేతలు అక్రమ సంపాదమే ధ్యేయంగా ఇసుక అక్రమ రవాణా, భూ కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. అయితే వైకాపా నేతల దుశ్చర్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండ కడుతున్నారని అభినందించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు నిరుద్యోగులు మహిళలు యువత అన్ని వర్గాలు వైకాపా పాలన పట్ల విసిగిపోయారన్నారు. గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన నిధులను సైతం ఈ ప్రభుత్వం ఉపయోగించుకుని సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందన్నారు. దీనిపై సర్పంచులు మూకుమ్మడిగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే ఈ ప్రభుత్వం పోలీసులతో సర్పంచ్ ల పై దౌర్జన్యం చేయించిందని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయని, ఇతర పార్టీలకు చెందిన ఎంతోమంది టీడీపీలకు చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారందరికీ తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని కేవలం అక్రమ సంపాదన పైనే వైకాపా నేతలు దృష్టి సారించారని పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజలు వైకాపా దుష్ట చర్యలను గమనిస్తున్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నారు.

సమన్వయంతో ముందుకెళ్లండి
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్లాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. స్థానిక జేబీఎస్ ఫంక్షన్ హాలు లో గురువారం పలు వార్డులకు చెందిన నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, సమస్యలు తదితర విషయాలపై చర్చించారు. కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉండాలని తెలిపారు. పార్టీ శ్రేణులు ఐకమత్యంతో ముందుకెళ్లి టిడిపి విజయానికి కృషి చేయాలన్నారు ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలకు చేరగా పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. అదేవిధంగా పలు విభాగాలు ఎమ్మెల్యేను గజమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article