సంక్షేమ పాలకుని ఆశీర్వదించండి
జగనన్నను, అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం
ఎన్నికల ప్రచారంలో వైఎస్ మనోహర్ రెడ్డి ,వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి
పులివెందుల టౌన్
రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని, సంక్షేమ పాలకుని ప్రజలు ఆశీర్వదించాలని, సంక్షేమ పాలన జగన్ తోనే సాధ్యమని, నవరత్న పథకాలు మళ్లీ అందాలంటే జగనన్న ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, జగనన్న పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని జగనన్నను అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని,
ఎన్నికల ప్రచారంలో వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ కిరణ్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలో మెయిన్ బజార్ లో వైకాపా నాయకులతో కలసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు మేలు జరిగే విధంగా జగన్ మేనిఫెస్టో వదలడం జరిగిందన్నారు. వృద్ధులకు 3500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టిడిపి కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వారు చెప్పే మాయమాటలు ఎవరు నమ్మవద్దని వారన్నారు. 14 సంవత్సరాల లో రాష్ట్రంలో ఏమి చేయలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారం కోసం లేనిపోని హామీలన్నీ ఇస్తున్నారని వారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను ముఖ్యమంత్రి చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఎన్నికల కోసం వేచి ఉన్నారన్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చిన రాష్ట్ర ప్రజలు జగన్ వైపు ఉన్నారన్నారు. ఎల్లో మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని కూడా వారన్నారు.ఈ కార్యక్రమంలో జెసిఎస్ ఇంచార్జ్ పార్నపల్లి కిషోర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డేనియల్ బాబు, శ్రీరాములు, కొమెర హరినాథ్ , కొంగనపల్లె మురళి, సంపత్ , లక్ష్మీ ప్రసన్న, గుల్జార్ , షాహిదా, పుష్పావతి, కాంతమ్మ, సంపత్ , రాజేశ్వరి, విజయ్ కుమార్ నాయుడు, శేఖర్ నాయుడు, శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ చలపతి, వెంకటపతి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

