రామిరెడ్డి పల్లిలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అపూర్వ ఆదరణ..
సంక్షేమ సారధికి మా మద్దతు అంటున్న ప్రజలు
చంద్రగిరి
“పల్లెల్లో పర్యటిస్తూ.. ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ యోగ క్షేమాలు అడగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పట్ల జనం ఆత్మీయతను చాటుతున్నారు. గడప గడపలో హారతులు పట్టి సాదరంగా స్వాగతం పలికారు. సంక్షేమ సారథికి మద్దతుగా వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని మాట ఇచ్చారు.”
చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. ముందుగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి అంజలి ఘటించారు. ఆ తర్వాత గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ జాబితాలను అందజేశారు. ప్రతి ఇంటా లబ్దిదారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. గ్రామ శివార్లలో స్థానిక ప్రజలు హర్షిత్ రెడ్డికి హారతులు పట్టి సాదరంగా ఆహ్వానిస్తూ గజ మాలలతో ఘనంగా సత్కరించారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలును స్థానిక ప్రజలుగుర్తుచేసుకున్నారు.
అంతటా.. అపూర్వ స్వాగతం..!
చంద్రగిరినియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన అభివృద్ధి, జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గురించి హర్షిత్ రెడ్డి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు అవకాశం లేకుండా అందరినీ సమానంగా చూసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తీరు పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మార్కెట్ యార్డు చైర్మన్ కొటాల చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి,పసల నాగరాజు, రాజయ్య, పలువురు మండల స్థాయి నేతలు, అధికారులు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.